గుంటూరు మీదుగా కొత్త అమృత్ భారత్ రైలు
GNTR: గుంటూరు మీదుగా మరో అమృత్ భారత్ రైలును రైల్వే బోర్డు మంజూరు చేసింది. అసోంలోని కామఖ్యకు ఈనెల 13న కొత్త రైలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే చర్లపల్లి–సిల్చార్‌కు నడుస్తున్న రైలుకు అదనంగా ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడతో పాటు పలు స్టేషన్లలో నిలుపుదల ఉంటుంది. ఈరైలులో స్లీపర్, జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి.