వాట్సాప్‌లో మృతదేహం చిత్రాలు.. నగదు స్వాహా

వాట్సాప్‌లో మృతదేహం చిత్రాలు.. నగదు స్వాహా

BPT: వేటపాలెం మండలం పాపాయిపాలెంకు చెందిన పులి హరికృష్ణ తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 5.47 లక్షలు పోయాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్ చెప్పారు. నీ వాట్సాప్‌లో వ్యక్తి మృతదేహం చిత్రాలు పంపామని దానిని చూడమని ఫోన్ వచ్చిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ చిత్రాలు చూస్తే నగదు పోయాయని తెలిపారు.