అభివృద్ధి వేగం ఎప్పుడూ ఆగదు: మంత్రి లోకేష్
AP: రాష్ట్రంలో అభివృద్ధి వేగం ఇక ఎప్పుడూ ఆగదని మంత్రి నారా లోకేష్ అన్నారు. బీపీసీఎల్ రామాయపట్నం పోర్టులో దేశంలోనే అతి పెద్ద రిఫైనరీ, పెట్రో కెమికల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని రికార్డు సమయంలో కేటాయించామన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. వేగంతో కూడిన సామర్థ్యమే ఏపీ ప్రత్యేకత అని పేర్కొన్నారు.