28న కందుకూరులో మెడికల్ క్యాంప్

28న కందుకూరులో  మెడికల్ క్యాంప్

NLR: కందుకూరు ఎంఈవో నాగ కుమార శర్మ మంగళవారం ఒక ప్రకటనలో,ఈ నెల 28వ తేదీన దివ్యాంగ విద్యార్థుల కోసం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంఈవో కార్యాలయ ఆవరణలో జరిగే ఈ శిబిరంలో 6 నుంచి 17 ఏళ్లలోపు దివ్యాంగ విద్యార్థులు పాల్గొనవచ్చు. ప్రత్యేక వైద్య నిపుణులు విద్యార్థులను పరీక్షించి, అవసరమైన ఉపకరణాల కోసం సిఫారసు చేస్తారు. ఉపకరణాలు అందిస్తామని తెలిపారు.