దారుణం.. తల్లిని చంపిన కొడుకు
NRPT: నారాయనపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్ నగర్‌లో దారుణం జరిగింది. భీమమ్మ (65) అనే వృద్ధురాలిని ఆమె చిన్న కుమారుడు రామకృష్ణ నరికి, బండరాయితో బాది చంపాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న భీమమ్మను నిందితుడు పారతో నరికినట్లు కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. దీంతో భీమమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.