రాములోరిని దర్శించుకున్న కవిత దంపతులు
నిజామాబాద్‌లోని శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాం మందిర్)లో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకలకు కల్వకుంట్ల కవిత - దేవనపల్లి అనిల్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.