భారీ వర్షాలకు అద్వాన్నంగా మారిన రహదారులు

భారీ వర్షాలకు అద్వాన్నంగా మారిన రహదారులు

కోనసీమ: అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గుంతల్లో వర్షం నీరు చేరి బురదమయమైంది. ఈ దారిలో ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. నడిచి వెళ్దామంటే అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.