కాలినడకన తిరుమలకు బయలుదేరిన భక్తులు

కాలినడకన తిరుమలకు బయలుదేరిన భక్తులు

AKP: మునగపాక మండలం వాడ్రాపల్లి నుంచి తిరుమలకు కాలి నడకన వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకున్న 15 మంది భక్తులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. వీరిలో పలువురు అనేక పర్యాయాలు తిరుపతికి కాలినడకన వెళ్లారు. సుమారు 26 రోజులు పడుతుందని భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు, గ్రామ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు పాల్గొన్నారు.