VIDEO: 'సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి'

మన్యం: గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు షూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారని ప్రస్తుతం పేదలపై అధిక భారాలు మోపుతూ బాదుతున్నారని మాజీ ఎమ్మెల్యే జోగారావు మండిపడ్డారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం సరైన విధానం కాదని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.