వీణవంకలో కార్మికుల రాస్తారోకో..!

వీణవంకలో కార్మికుల రాస్తారోకో..!

KNR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యుడు పిల్లి రవి యాదవ్ మాట్లాడుతూ ..కేంద్రం లేబర్ కోడ్ పేరుతో కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటాలు కొనసాగిస్తాం అన్నారు.