'రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి'
BHPL: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీసంక్షేమసంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీసీలపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును చట్ట రూపంలో తీసుకురావాలన్నారు.