VIDEO: శారదనగర్‌లో తప్పిన రోడ్డు ప్రమాదం

VIDEO: శారదనగర్‌లో తప్పిన రోడ్డు ప్రమాదం

AKP: నర్సీపట్నం–తుని రోడ్డులోని శారదనగర్ సమీపంలో గురువారం భారీ ప్రమాదం తప్పింది. నర్సీపట్నం నుంచి తునివైపు అతి వేగంగా రాష్‌ డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఓ యువకుడు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఆగ్రహించిన ప్రజలు యువకుడిని నిలదీసి అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.