భర్తపై గొడ్డలితో దాడి చేసి హత్య

భర్తపై గొడ్డలితో దాడి చేసి హత్య

ASR: చింతపల్లి(M) మేడూరు గ్రామంలో భార్యా భర్తల మధ్య ఫోన్ విషయమై తరచూ జరుగుతున్న వాగ్వివాదం చివరకు హత్యకు దారి తీసింది. భర్త రాజారావు (45) నిద్రలో ఉండగా భార్య దేవి గొడ్డలితో దాడి చేయడంతో రాజారావు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాజారావును చింతపల్లి ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి విశాఖ KGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.