సీతారామునిపేటలో అంబేద్కర్ వర్ధంతి
VZM: నెల్లిమర్ల (M) సీతారామునిపేటలో శనివారం అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. రాష్ట్ర YCP SC సెల్ ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు అంబేడ్కర్ చేసిన సేవలు గొప్పవని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.