మరికాసేపట్లో సౌతాఫ్రికా-Aతో భారత్-A ఢీ
మరికాసేపట్లో భారత్-A, సౌతాఫ్రికా-A రెండో అనధికార టెస్టులో తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం కుల్దీప్ యాదవ్ భారత జట్టులో చేరనున్నాడు. సౌతాఫ్రికా టెస్టు సిరీస్ నేపథ్యంలో అతణ్ని ఆసీస్‌తో T20 సిరీస్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కాగా రిషభ్ పంత్ నేతృత్వంలో ఆడుతున్న భారత్ తొలి అనధికార టెస్టులో విజయం సాధించింది.