VIDEO: నక్కపల్లిలో హాకీ క్రీడాకారుల ర్యాలీ

AKP: భారత్ హాకీ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ నక్కపల్లిలో హాకీ క్రీడాకారులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఎనిమిదేళ్ల తర్వాత హాకీ జట్టు విజేతగా నిలిచి తమకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. జాతీయ జెండాలు చేత పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ పుర వీధుల్లో క్రీడాకారులు ర్యాలీ చేశారు.