సిరీస్ ఓటమి.. గంభీర్‌పై నెట్టింట ట్రోల్స్
సౌతాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్ అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రయోగాల పేరిట గంభీర్ జట్టుతో ఆడుకుంటున్నాడని, వెంటనే టెస్ట్ ఫార్మాట్ కోచింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత కోచ్‌లతో పోల్చుతూ, అలాగే అతని కోచింగ్‌లో కోల్పోయిన 4 సిరీస్‌లను ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.