ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ఏయూ స్టూడెంట్స్ ఫెస్ట్
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 25, 27 తేదీల్లో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ఏయూ స్టూడెంట్స్ ఫెస్ట్ జరగనుంది. కార్యక్రమ పోస్టర్‌ను వీసీ ప్రొ.జీ.పీ. రాజశేఖర్ శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభను వెలుగులోనికి తేవడమే లక్ష్యమని వీసీ తెలిపారు. మూడు రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగునున్నాయని తెలిపారు.