రేపు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన

ప్రకాశం: పామూరు పట్టణంలోని విరాట్ నగర్‌లో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 332వ ఆరాధన మహోత్సవాన్ని ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరాధన ఉత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, పూజలు జరుగుతాయని, మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాత్రికి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు.