'ఈనెల 30 వరకు 50 శాతం వడ్డీ మాఫీ'

'ఈనెల 30 వరకు 50 శాతం వడ్డీ మాఫీ'

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్నుల వడ్డీపై ప్రభుత్వం 50% మాఫీని ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై. ఓ నందన్ సూచించారు. ఈ పన్నులను పురమిత్ర యాప్, CDMA వెబ్‌సైట్, నగర పాలక సంస్థ కౌంటర్ల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.