యువకుడిపై పోక్సో కేసు నమోదు
KDP: ఇంటర్ విద్యార్థిని (16)ను లైంగికంగా వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన నాలి పవన్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఆ విద్యార్థినిని కొంతకాలంగా లైంగికంగా వెంటాడుతూ వేధిస్తున్నాడు. విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.