డెంగ్యూ నిర్మూలన.. మన అందరి బాధ్యత.!

డెంగ్యూ నిర్మూలన.. మన అందరి బాధ్యత.!

MDK: డెంగ్యూ వ్యాధి నిర్మూలనను పురస్కరించుకుని రేగోడ్ మండల వైద్యాధికారి డా.వికాస్ పలు సూచనలు చేశారు.‌ పరిసరాలను శుభ్రంగా ఉంచి, నిల్వ నీరు తొలగించాలని తెలిపారు. దోమల పెంపకానికి కారణమయ్యే చెత్త, నీటి గుంతలు వెంటనే తొలగించాలన్నారు. పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే డెంగ్యూ వ్యాధి పూర్తిగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.