'అవసరమైన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి'

'అవసరమైన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి'

వనపర్తి: జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువలు, నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈయన తన ఛాంబర్‌లో భూసేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి ఇంకా పెగ్ మార్కింగ్(రేఖ గుర్తింపు) చేయని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.