పీహెచ్సీని సందర్శించిన డీ.ఎం.హెచ్.వో

పీహెచ్సీని సందర్శించిన డీ.ఎం.హెచ్.వో

KMM: ఖమ్మం జిల్లా DHMO కళావతి బాయి మంగళవారం మంచుకొండ పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.