రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు

తూ.గో: రాజమహేంద్రవరంలోని రాజా థియేటర్ సమీపంలోని మెయిన్ రోడ్డుపై శనివారం మధ్యాహ్నం బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు వెంటనే 108కు ద్వారా ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.