సర్పంచ్‌గా గెలుపొందిన కవిత, పరమేశ్
జిల్లాలో రెండో విడత ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొర్రూర్ మండలం బోజ్యతండా సర్పంచ్ గా BRS బలపరిచిన అభ్యర్థి మాలోతు కవిత విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం పట్ల BRS నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు పెద్దవంగర మండలం LB తండా సర్పంచ్ గా ధరావత్ పరమేశ్(కాంగ్రెస్) గెలుపొందారు.