బనగానపల్లె నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
NDL: మహా శివరాత్రి పండుగ సందర్భంగా బనగానపల్లె ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం క్షేత్రానికి ఈ నెల 15 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గురువారం డీఎం శశి భూషణ్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10, 11, 12 గంటలకు మూడు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. అటు యాగంటికి 15, 16 తేదీల్లో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.