వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద 10 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద 10 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

WGL: వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో సోమవారం ట్రాఫిక్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను తదుపరి చర్యల కోసం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు.