'రాజ్యసభ ఎన్నికల్లో మాదిగలకు అవకాశం కల్పించాలి'
SRD: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాదిగలకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డికి గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు బుచేంద్ర మాట్లాడుతూ.. మాదిగలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించుకుంటే కాంగ్రెస్ పార్టికీ బుద్ధి చెప్తామని హెచ్చరించారు.