ఉగాది పండుగ.. పెరిగిన పూలు, పండ్ల ధరలు
తూ.గో: ఉగాది పండుగ నేపథ్యంలో మార్కెట్లో పూలు, పండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్నటి వరకు రాజమండ్రిలో రూ.50 ఉన్న బంతిపూలు గురువారం రూ. 100లకు చేరాయి. చామంతి రూ.350, గులాబి రూ.300 పలుకుతున్నాయి. మామిడికాయలు, వేప పువ్వు ధరలు కూడా భారీగా పెరిగాయి. పండుగ పూట సామాన్యుడికి ఈ ధరలు భారంగా మారాయి.