సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే.వీ. విశ్వనాథన్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలనాంశాల గురించి చర్చించారు.