స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MP, MLA

ADB: జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్, MLA పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమంలో అమరులైన వారికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లాధ్యక్షులు పతంగి బ్రహ్మానందం , నాయకులు చంద్రకాంత్, కార్యకర్తలు తదితరులున్నారు.