కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు నామినేషన్
KMM: రఘునాథపాలెం మండలం ఉదయ్‌నగర్ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సిద్ధిక్, వార్డు సభ్యులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వరకు గ్రామస్థులు వారితో కలిసి వచ్చి మద్దతు ప్రకటించారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని సిద్ధిక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.