ఇదేదో ఏజెన్సీ ప్రాంతం కాదు.. మన పాలేరే.!

KMM: తిరుమలాయపాలెం (M) బంధంపల్లి వద్ద ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది వచ్చిన వరదల వల్ల బంధంపల్లి వద్ద ఉన్న వంతెన కూలిపోయింది. కాగా ఇప్పటివరకు నూతన వంతెన నిర్మించలేదు. బుధవారం ప్రజలకు వైద్యం అందించేందుకు గాను ఆశవర్కర్లు ఫోటోలు కనిపిస్తున్న విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దాటారు.