కార్పొరేషన్ ఛైర్మన్‌ను కలిసిన బీసీ నాయకులు

W.G: ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన కుడుపూడి సత్తిబాబును ఆచంట మండల బీసీ సంఘాల నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడాల శ్రీనివాస్, నాగ సత్యనారాయణ, శేఖర్, ఏడుకొండలు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు.