కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్లో సమీక్ష
ప్రకాశం: కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి సీఐ సోమశేఖర ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరగా చర్యలు తీసుకోవాలని సీఐ సిబ్బందిని ఆదేశించారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ, విద్యార్థులకు డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు.