'అవకతవకలు జరిగితే ఉపేక్షించం'

'అవకతవకలు జరిగితే ఉపేక్షించం'

VZM: మద్యం షాపుల నిర్వహణలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై శ్రీనివాస చౌదరి హెచ్చరించారు. సోమవారం గజపతినగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరును సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.