గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం
NLG: మల్లారం, కట్టంగూరు గ్రామాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని VBRI అధికారి డాక్టర్ నీరజ, పశు వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్ సూచించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఎల్‌ఎస్‌ఏ అరుణ, గోపాల మిత్రులు చెరుకు శ్రీనివాస్, కావాటి యాదగిరి, ఓఎస్ కిరణ్ పాల్గొన్నారు.