ప్రశాంతి నిలయంలో ముగిసిన యువజన పార్థియాత్ర
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆంధ్రప్రదేశ్ యువత చేపట్టిన మూడు రోజుల పార్థియాత్ర శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ యాత్రలో 2,200 మందికి పైగా యువతీ యువకులు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా 'యువ స్ఫూర్తి - సాయి అనుగ్రహ దీప్తి' అనే సందేశాత్మక నాటకాన్ని ప్రదర్శించారు. సవాళ్లను అధిగమించి సేవా మార్గంలో ఎలా నడవాలో నాటకం ద్వారా వివరించారు.