చెన్నారెడ్డిపల్లిలో పొలంబడి కార్యక్రమం

ప్రకాశం: రైతులకు సాగులో నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి జోష్నాదేవి వివరించారు. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన పైర్లను పెంచడం, సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి సాధించడం పొలంబడి లక్ష్యమని పేర్కొన్నారు.