'ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలి'

KRNL: కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు, జాబితా నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి యస్.రవీంద్ర బాబు కోరారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్త ఓటరు నమోదు, మార్పుచేర్పులు, తొలగింపునకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిందని, దీనిని సక్రమంగా నిర్వహించాలన్నారు.