వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి

GNTR: కేంద్ర సామాజిక న్యాయం ,సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన వికసిత్ భారత్ 2027 వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా పలు ముఖ్య సూచనలు చేశారు. ఆరోగ్య బీమా పథకాలలో వయస్సు పరిమితి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.