VIDEO: సంగమేశ్వర స్వామికి సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు

VIDEO: సంగమేశ్వర స్వామికి సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు

SRD: తెలంగాణలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం సంగమేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణలో దివ్యదర్శనమిచ్చారు. వైశాఖమాసం, కృష్ణపక్షం, విదియ, సౌమ్య వాసరే పురస్కరించుకొని అర్చకులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళహారతి సమర్పించారు.