తుఫాన్ ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధం: ఎస్పీ

తుఫాన్ ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సిద్ధం: ఎస్పీ

బాపట్ల జిల్లాలోని అద్దంకి, చిన్నగంజాం, రేపల్లె, నిజాంపట్నం, నగరం మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదివారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83338 13228కు ఫోన్ చేయాలని సూచించారు.