సాంకేతిక లోపం.. విమానం అత్యవసర ల్యాండింగ్

సాంకేతిక లోపం.. విమానం అత్యవసర ల్యాండింగ్

TG: HYD నుంచి తిరుపతికి బయలుదేరిన అలియన్స్ ఎయిర్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌ అయ్యాక పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు ఉండగా, ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారంతా ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో వేచి చూస్తున్నారు.