SIR పేరుతో ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు: మమతా
బెంగాల్‌లో SIR పేరుతో లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేరును ఈసీ తొలగించిందని సీఎం మమతా ఆరోపించారు. దీంతో అనేక మంది మైనార్టీలు, వలస కార్మికులు నష్ట పోయారని పేర్కొన్నారు. ఏకపక్షంగా ఈ తొలగింపులు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. తమ స్థానికతను నిరూపించుకోవడానికి ప్రజలకు ఒక్క అవకాశమూ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో టీఎంసీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు.