భీమవరం: నలుగురు గంజాయి బాబులు అరెస్ట్

భీమవరం: నలుగురు గంజాయి బాబులు అరెస్ట్

W.G: భీమవరంలో గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు గురువారం తెలిపారు. వారి నుంచి 2 కేజీల 862 గ్రాములు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశా నుంచి భీమవరం తరలిస్తున్న గంజాయి ముఠాపై నిఘా పెట్టామని అన్నారు. గంజాయి ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.