డయేరియా బాధితులను పరామర్శించిన MLA

డయేరియా బాధితులను పరామర్శించిన MLA

విజయనగరం జిల్లా రాజాంలోని మేజర్ పంచాయతీ పొగిరి గ్రామంలో డయేరియా బాధితులను ఎమ్మెల్యే మురళీమోహన్ పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.