అధికారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎస్పీ
అన్నమయ్య: రామసముద్రం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బత్తల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ రాయచోటిలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం గాలివీడు మండలం కరిమిరెడ్డిగారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కుటుంబానికి రూ.1లక్ష ఆర్థిక సాయం అందజేశారు.