రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి

ATP: విడపనకల్ మండలం పెంచలపాడు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.